శివసేన కోరితే.. మద్దతు ఇస్తాం: బీజేపీ

ముంబై :  సంచలన రాజకీయాలకు ఇటీవల వేదికగా నిలిచిన మహారాష్ట్ర.. మరోసారి వార్తల్లో నిలిచే అవకాశం కనిపిస్తోంది. శివసేనను దూరంగా చేసుకుని  ఏకంగా సీఎం పీఠాన్ని కోల్పోయిన బీజేపీ.. తిరిగి పాత స్నేహాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆశ ఇంకా బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కోరితే.. వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు సుధీర్‌ మునగంటివార్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాందేడ్‌ పర్యటనలో ఉన్న ఆయన రాష్ట్ర రాజకీయాలపైస్పందిస్తూ.. శివసేన తమ మిత్రపక్షమేనని, ఇద్దరి సిద్దాంతాలూ ఒకటేనన్నారు.